తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 15న ప్రత్యేక లోక్ అదాలత్
తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఈ నెల 15న రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని అన్ని కోర్టుల్లో ఒకేసారి జరిగే ఈ కార్యక్రమంలో NI యాక్ట్ కేసులు, క్రిమినల్ కేసులు, కుటుంబ తగాదాలు, మోటార్ వాహనాల ప్రమాదాల కేసులు, సివిల్ మరియు బ్యాంకు సంబంధిత కేసులు పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
ఈ ప్రత్యేక లోక్ అదాలత్ ప్రధాన ఉద్దేశ్యం పెండింగ్‌లో ఉన్న కేసులను వేగంగా పరిష్కరించడం, ప్రజలకు న్యాయం అందించడంలో వేగం తీసుకురావడం.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా దీనికి సంబంధించి నవంబర్ 1న పోలీసులు, న్యాయ అధికారులు, సంబంధిత విభాగాలతో సమావేశం జరిగింది. ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
➡️ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ కేసులను సఖ్యతతో పరిష్కరించుకోవాలని అధికారులు పిలుపునిచ్చారు.

Post a Comment