-->

తెలంగాణలో మరోసారి కొత్త ఓటర్ల నమోదుకు ఈసీ ఆదేశాలు

 

తెలంగాణలో మరోసారి కొత్త ఓటర్ల నమోదుకు ఈసీ ఆదేశాలు

హైదరాబాద్‌, నవంబర్‌ 2: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లలో భాగంగా మరోసారి కొత్త ఓటర్లను నమోదు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్లకు ఈ మేరకు శనివారం సూచనలు పంపింది.

గత నెల 1వ తేదీ నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న యువతీ యువకులు, కేంద్ర ఎన్నికల సంఘం రూపొందిస్తున్న శాసనసభ నియోజకవర్గాల ఓటర్ల జాబితాలో ఈ నెల 15వ తేదీ వరకు నమోదయ్యే వారిని గ్రామ పంచాయతీ వార్డు వారీగా స్థానిక ఎన్నికల ఓటర్ల జాబితాలో చేర్చాలని ఎస్ఈసీ తెలిపింది.

స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడినా లేదా పునఃనిర్వహించాల్సిన పరిస్థితులు వచ్చినా ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను చేపట్టాలని అధికారులకు ఆదేశించింది.

ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సమయానికి పూర్తి చేసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్ఈసీ స్పష్టం చేసింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793