-->

మూసాపేట్‌ మెజెస్టిక్‌ గార్డెన్స్‌లో మున్నూరు కాపు, కాపుల ఆత్మీయ సమ్మేళనం

మూసాపేట్‌ మెజెస్టిక్‌ గార్డెన్స్‌లో మున్నూరు కాపు, కాపుల ఆత్మీయ సమ్మేళనం

మూసాపేట్‌ మెజెస్టిక్‌ గార్డెన్స్‌లో మున్నూరు కాపు, కాపుల ఆత్మీయ సమ్మేళనం. ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్‌ నేతలు శ్యామ్‌ మోహన్, ఈరవత్రి అనిల్, వినయ్, ఆకుల లలిత, కేకే మహేందర్‌ రెడ్డి, గాలి అనిల్‌ కుమార్, బొమ్మ శ్రీరాం చక్రవర్తి, సత్తు మల్లేష్ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్ గెలుపు కోసం మున్నూరు కాపు, కాపుల సమాజం ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించింది.

సమాజ ఐక్యతతో నవీన్‌ యాదవ్ విజయం సాధించేలా కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. సమ్మేళనం ముగింపు సందర్భంగా పాల్గొన్న నాయకులను, ప్రముఖులను ఘనంగా సన్మానించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793