ఎక్సైజ్ అధికారుల తనిఖీల్లో నిషేధిత పాపీ స్ట్రా పౌడర్ పట్టివేత
మెదక్ జిల్లా, తూప్రాన్ – నవంబర్ 8: మెదక్ జిల్లా తూప్రాన్ పరిధిలోని అల్లాపూర్ టోల్ ప్లాజా వద్ద ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 430 గ్రాముల నిషేధిత పాపీ స్ట్రా పౌడర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు నర్సాపూర్ ఎక్సైజ్ సీఐ గులాం ముస్తఫా తెలిపారు.
టోల్ ప్లాజా వద్ద వాహన తనిఖీలు జరుపుతుండగా, రాజస్థాన్‌కు చెందిన రావల్ సింగ్ (33) అనే వ్యక్తి ప్రయాణిస్తున్న బస్సులో ఈ పౌడర్ దొరికినట్లు చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై కాజా అజీజ్ అహ్మద్‌తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Post a Comment