నేటి నుంచి మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం
హైదరాబాద్, నవంబర్ 19: మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఇందిరమ్మ కోటి చీరల పంపిణీని నేడు ప్రారంభించనుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని ఇందిరా గాంధీ విగ్రహం వద్ద మధ్యాహ్నం 12 గంటలకు కార్యక్రమానికి శుభారంభం పలకనున్నారు. ముందుగా విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, అనంతరం చీరల పంపిణీని ప్రారంభిస్తారు.
కార్యక్రమం రెండు దశల్లో జరుగనుంది.
• మొదటి దశ: నేటి నుంచి డిసెంబర్ 9 — తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు గ్రామీణ ప్రాంతాల్లో చీరల పంపిణీ.
• రెండో దశ: మార్చి 1 నుంచి మార్చి 8 — అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని పట్టణ ప్రాంతాల్లో పంపిణీ.
ఈ కోసం సిరిసిల్ల చేనేత కార్మికులు 55 లక్షల చీరలను సిద్ధం చేసినట్లు సమాచారం..

Post a Comment