ఇందిరమ్మ చీరల పంపిణీకి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
హైదరాబాద్, నవంబర్ 19: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి బుధవారం అధికారికంగా ప్రారంభించారు. ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని, హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో ఉన్న మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు అర్పించిన అనంతరం ఆయన చీరల పంపిణీ ఆరంభించారు. పలువురు మహిళలకు స్వయంగా చీరలను అందజేశారు.
- మొదటి విడత: గ్రామీణ ప్రాంతాల్లో నేటి నుంచే–డిసెంబర్ 9 వరకు.
- రెండో విడత: పట్టణ ప్రాంతాల్లో మార్చి 1–మార్చి 8 (అంతర్జాతీయ మహిళా దినోత్సవం).
చీరల తయారీకి సమయం పడుతుండటంతో తొలి విడతగా 65 లక్షల చీరలు పంపిణీ చేస్తున్నట్లు, మిగిలిన వాటిని తరువాతివిడతలో అందజేస్తామని ప్రకటించారు.
మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ ఇందిరమ్మ చీర కట్టుకొని మహిళా ఆత్మగౌరవానికి బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలని సీఎం పిలుపునిచ్చారు. మహిళా సాధికారత, ఆర్థిక పురోగతికి తమ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ నరసింహ, వాకిటి శ్రీహరి, కొండ సురేఖ, సీతక్క తదితరులు పాల్గొన్నారు.

Post a Comment