-->

మావోయిస్టు పార్టీ కీలక నేత ఆజాద్ అలియాస్‌ గోపన్న లొంగుబాటు?

మావోయిస్టు పార్టీ కీలక నేత ఆజాద్ అలియాస్‌ గోపన్న లొంగుబాటు?


ములుగు జిల్లా, నవంబర్‌ 14: తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ దెబ్బ తగలనుంది. రాష్ట్రంలో కీలక నేతల లొంగుబాటుకు అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం వెల్లడిస్తోంది. మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్న తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యాడ సాంబయ్య అలియాస్‌ ఆజాద్‌ అలియాస్‌ గోపన్న త్వరలోనే పోలీసులు ఎదుట లొంగిపోనున్నారని తెలుస్తోంది. ఆయన నేతృత్వంలో భారీ ఎత్తున క్యాడర్‌ జనజీవన స్రవంతిలోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సమాచారం మేరకు భద్రాద్రి కొత్తగూడెం–అల్లూరి సీతారామరాజు (ASR) జిల్లాల సరిహద్దులోని మోద్దులగూడెం గ్రామానికి చెందిన డివిజన్‌ కమిటీ కార్యదర్శి ఆజాద్, తోడుగా మరో కీలక నేత డివిజన్‌ కమిటీ సభ్యుడు అప్పాసి నారాయణ అలియాస్‌ రమేశ్‌ కూడా లొంగుబాటు ప్రక్రియలో ఉన్నట్లు తెలుస్తోంది.

మావోయిస్టు అగ్రనాయకత్వం దాదాపు 90 శాతం మంది ఇప్పటికే స్వచ్ఛందంగా ప్రధాన ప్రవాహంలోకి చేరిన నేపథ్యంలో, ఈ తాజా పరిణామం మిగిలిన స్ధానిక నాయకత్వాన్ని కూడా ప్రభావితం చేసే అవకాశముందని పోలీసులు అంచనా వేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793