నేటి నుంచి టెట్ దరఖాస్తులు ప్రారంభం రెండో విడత నోటిఫికేషన్ విడుదల
హైదరాబాద్: నవంబర్ 15: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET–2025) రెండో విడత నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈరోజు నవంబర్ 15 నుంచి 29వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు.
అధికారిక షెడ్యూల్ ప్రకారం, జనవరి 3 నుంచి 31వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో టెట్ పరీక్షలను నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం రెండుసార్లు టెట్‌ను నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 2025లో మొదటి విడత పరీక్షను జూన్‌లో విజయవంతంగా పూర్తి చేసిన విద్యాశాఖ, ఇప్పుడు రెండో విడత నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఇదే సమయంలో, సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న ఇచ్చిన తీర్పు ప్రకారం, ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పటికే పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఉద్యోగాల్లో కొనసాగాలంటే తప్పనిసరిగా టెట్ పాస్ కావాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం టీచర్లుగా పని చేస్తున్న అనేక మంది కూడా ఈసారి టెట్ రాయాల్సి వస్తోంది.
అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే టెట్‌లో ఉత్తీర్ణత తప్పనిసరైపోవడంతో, ఉపాధ్యాయ విద్య పూర్తి చేసిన ప్రతి అభ్యర్థి ఈ పరీక్ష రాయాల్సిన అవసరం ఉంది.
అర్హతలు:
- పేపర్–1: డి.ఇడ్ (D.El.Ed) పూర్తి చేసిన వారు
- పేపర్–2: బి.ఇడ్ (B.Ed) పూర్తి చేసిన వారు

Post a Comment