-->

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ… ఎదురు కాల్పుల్లో కేంద్ర కమిటీ దళపతి హిడ్మా మృతి!

మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ… ఎదురు కాల్పుల్లో కేంద్ర కమిటీ దళపతి హిడ్మా మృతి!


అల్లూరి సీతారామరాజు జిల్లా, మారేడుమిల్లి: మారేడుమిల్లి అటవీ ప్రాంతం ఉదయం గంటల నుంచి యుద్ధభూమిని తలపించింది. భద్రతా దళాలు—మావోయిస్టుల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మరణించిన వారిలో మావోయిస్టు పార్టీలో అత్యంత కీలక నాయకుడు, కేంద్ర కమిటీ దాడుల వ్యూహకర్త హిడ్మా కూడా ఉన్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య జరిగిన ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్‌లో హిడ్మా భార్యతో పాటు మరో నలుగురు మావోయిస్టులు చనిపోయినట్లు ప్రాథమిక వివరాలు వెల్లడిస్తున్నాయి. అయితే పూర్తి సమాచారం కోసం ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


అటవీ ప్రాంతంలో భారీ కూబింగ్ – సమాచారం దొరకడంతో ఆపరేషన్ వేగం

మారేడుమిల్లి లోతట్టు అరణ్యాల్లో అగ్ర మావోయిస్టు నాయకులు తలదాచుకున్నారన్న నిఘా సమచారం భద్రతా దళాలకు అందింది. దీని నేపథ్యంలో సీఆర్‌పీఎఫ్, గ్రేల్హౌండ్స్‌ దళాలు భారీ ఎత్తున అటవీలో కూబింగ్ నిర్వహించాయి. ఇదే సమయంలో మావోయిస్టులు కాల్పులు ప్రారంభించడంతో రెండు వర్గాల మధ్య తీవ్ర ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది.


హిడ్మా – దండకారణ్యాన్ని కుదిపేసిన గెరిల్లా వ్యూహకర్త

సుక్మా జిల్లా పూవర్తికిలో జన్మించిన హిడ్మా (విలాస్/హిడ్మాల్/సంతోష్ గా కూడా తెలిసిన) వయసు 50 ఏళ్లకు పైబడింది. హిందీ, గోండి, తెలుగు, కోయ, బెంగాలీ భాషలపై మంచి పట్టుతో మావోయిస్టు పార్టీలో వేగంగా ఎదిగిన ఆయన, దండకారణ్యంలో గెరిల్లా వార్ ఫేర్‌కి ప్రధాన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు.

  • హిడ్మాపై ప్రకటించిన ఇనామం రూ. 1 కోటి
  • ఆయన భార్యపై రూ. 50 లక్షలు
  • 2017లో 25 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను బలిగొన్న దాడికి హిడ్మానే ప్రధాన నేరస్తుడు

చత్తీస్‌గఢ్‌లో జరుగుతున్న భద్రతా దళాల ఆపరేషన్ల వల్ల ఒత్తిడి పెరగడంతో, హిడ్మా బృందం మారేడుమిల్లి అటవీ ప్రాంతానికి చేరుకుందని పోలీసులకు ముందుగానే సమాచారం లభించినట్లు తెలుస్తోంది.


ఇంకా కొనసాగుతున్న కూబింగ్… పరిస్థితి ఉద్రిక్తం

ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో ఇంకా కూబింగ్ కొనసాగుతోంది. ఏమైనా మావోయిస్టులు పరారై ఉండవచ్చన్న అనుమానంతో అడవిని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఇద్దరి మధ్య కాల్పులు కొన్నిసేపు కొనసాగినట్లు కూడా అధికారులు తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793