ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టిన కంపెనీపై చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో పిర్యాదు
ముక్కు పిండి మరీ వసూల్ చేయాలని ప్రజావాణిలో పిర్యాదు
మెదక్, నవంబర్ 3: ప్రభుత్వ నిబంధనలను ధిక్కరించి, ఖజానాకు గండి కొట్టిన టి.ఎం. టైర్స్ అండ్ ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీపై తగిన చర్యలు తీసుకోవాలని కాళ్లాకల్ గ్రామ ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేశారు.
ఈ మేరకు వారు సోమవారం ప్రజావాణిలో పిర్యాదు సమర్పించారు. సదరు కంపెనీ యాజమాన్యం వద్ద నుంచి నష్టపరిహారంతో పాటు అసలు మొత్తం ముక్కు పిండి మరీ వసూల్ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం, కంపెనీ ప్రాంగణంలో నిర్మాణ వ్యత్యాసాలు చోటుచేసుకున్నప్పటికీ, నిర్మాణ పన్నులు మరియు ఛార్జీలు ఎగవేసినట్లు ఫిర్యాదుదారులు పేర్కొన్నారు. దీంతో, సంబంధిత డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వ అధికారులను కోరారు.
మెదక్ జిల్లా కాళ్లాకల్ గ్రామంలో ఉన్న ఈ కంపెనీ వద్ద ₹4,04,16,483/- (నాలుగు కోట్లు నాలుగు లక్షల పదహారు వేల నాలుగు వందల ఎనభై మూడు రూపాయలు) హెచ్‌టీసీ విద్యుత్ వినియోగ సర్చార్జ్ మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని వారు కలెక్టర్‌కి వినతిపత్రం సమర్పించారు.
ప్రజా నిధుల రక్షణ దృష్ట్యా, న్యాయం పరంగా కూడా ఈ మొత్తాన్ని రికవరీ చేసి, జరిమానాలు విధించాలంటూ ఉట్ల రమేష్, బంటు నగేష్, గిరిధర్ తదితరులు ప్రజావాణి ద్వారా డిమాండ్ చేశారు.

Post a Comment