సింగరేణి భవన్ ముట్టడికి కవితక్క పిలుపు జాగృతి, hms నాయకులు అర్థరాత్రి అరెస్టులు
పేద్దపల్లి: సింగరేణి భవన్ ముట్టడికి ఎమ్మెల్సీ కవితక్క ఇచ్చిన పిలుపు నేపధ్యంలో సింగరేణి జాగృతి నేతలపై పోలీసుల చర్యలు తీవ్ర ఆందోళనకు గురిచేశాయి. మంగళవారం అర్థరాత్రి సింగరేణి జాగృతి రాష్ట్ర అధ్యక్షులు, హెచ్‌ఎంఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ వెంకటేష్, నాయకులు కయ్యం, రామగుండం జాగృతి అధ్యక్షుడు బొగ్గుల సాయి కృష్ణ, జాగృతి సోషల్ మీడియా విభాగం నాయకుడు బాకీ నాగరాజులను పోలీసులు అరెస్టు చేసి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ అరెస్టులను వివిధ కార్మిక సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. “నాయకులను అరెస్టు చేసినంత మాత్రాన రేపటి ముట్టడి ఆగదు… ముట్టడి ఖచ్చితంగా జరుగుతుంది” అని కార్మిక సంఘ ప్రతినిధులు స్పష్టం చేశారు.
సింగరేణి కార్మికులకు న్యాయం చేయాలని, వారి సమస్యలకు పరిష్కారం కనుగొనాలని డిమాండ్ చేస్తూ కవితక్క ఆధ్వర్యంలో ఉద్యమం జోరుగా కొనసాగుతోంది.

Post a Comment