మంగళగిరిలో 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం తండ్రీ–కొడుకులు సహా నలుగురు అరెస్టు – పోక్సో కేసు నమోదు
గుంటూరు జిల్లా మంగళగిరిలో 13 ఏళ్ల బాలికపై నలుగురు వ్యక్తులు పలుమార్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ అమానవీయ ఘటనలో తండ్రీ–కొడుకులు ఉండడం కలకలం రేపింది.
తాడేపల్లి కేఎల్ రావు కాలనీకి చెందిన షేక్ ఖాదర్ బాషా (50), విజయవాడ ప్రకాశ్ నగర్‌కు చెందిన షేక్ సలీమ్ (42), షేక్ రబ్బానీ (39) బాలికను మంగళగిరి బైపాస్ వెంబడి ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం సలీమ్ బాలికను మంగళగిరి లక్ష్మీనసింహస్వామి కాలనీ చివరకు తీసుకెళ్లి మరోసారి అత్యాచారం చేశాడు.
తరువాత ఖాదర్ బాషా మరియు అతని కుమారుడు కమల్ సాహెబ్ (25) బాలికను తాడేపల్లి కేఎల్ రావు కాలనీకి తీసుకువెళ్లి మళ్లీ అత్యాచారం చేశారు. అనంతరం రబ్బానీ బాలికను ఆటోలో తీసుకెళ్తుండగా ఆమె కేకలు వేయడంతో స్థానికులు స్పందించి అడ్డుకుని బాలికను రక్షించారు.
బాలిక ఇంటికి చేరుకుని జరిగిన విషయం తల్లికి తెలిపింది. దీంతో బాధితురాలి తల్లి మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సీఐ కె.వీరాస్వామి ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం మంగళగిరి డాన్‌బోస్కో వద్ద నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం గుంటూరు ఎయిమ్స్‌కు తరలించారు.
నిందితులను ఆదివారం సాయంత్రం కోర్టులో హాజరుపరచగా, మంగళగిరి పోలీస్ స్టేషన్ నుంచి రోడ్డుపై నడిపిస్తూ తీసుకువెళ్లడం గమనార్హంగా మారింది. ఈ ఘటనపై జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Post a Comment