-->

సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం – 22 మందికి గాయాలు

సంగారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం – 22 మందికి గాయాలు


సంగారెడ్డి జిల్లా కంది సమీపంలో NH–65పై శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై నిలిపి ఉన్న టిప్పర్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

మెదక్‌ నుంచి పటాన్‌చెరు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రమాద సమయంలో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనతో కొంతసేపు NH–65పై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793