ఢిల్లీలో ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ 285 మంది అరెస్ట్
ఢిల్లీలో ఇటీవల జరిగిన బాంబు దాడి నేపథ్యంలో, రానున్న నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ పోలీసులు భారీ భద్రతా చర్యలు చేపట్టారు. “ఆపరేషన్ క్లీన్ స్వీప్” పేరుతో నగరవ్యాప్తంగా విస్తృత రైడ్స్ నిర్వహించారు.
ఈ ఆపరేషన్‌లో
- నార్కో ఆఫెండర్లు, బూట్‌లెగర్లు, పాత నేరస్తులు సహా మొత్తం 285 మందిని అరెస్ట్ చేశారు.
- భారీగా డ్రగ్స్, అక్రమ ఆయుధాలు, నగదు స్వాధీనం చేసుకున్నారు.
ముఖ్యంగా డ్వార్కా డిస్ట్రిక్ట్‌లో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో
- 9 మందిని అరెస్ట్ చేయగా
- 33 కిలోలకుపైగా డ్రగ్స్
- 40 అక్రమ ఆయుధాలు
- నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇటీవలి నగరవ్యాప్తంగా జరిగిన తనిఖీల్లో హెరాయిన్, గంజా, కొకైన్ వంటి మాదకద్రవ్యాలు పెద్ద మొత్తంలో పట్టుబడ్డాయి. నూతన సంవత్సర వేడుకల సమయంలో డ్రగ్స్ వినియోగం, అక్రమ కార్యకలాపాలు జరగకుండా కఠిన చర్యలు కొనసాగిస్తామని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.
న్యూ ఇయర్ వేడుకలు శాంతియుతంగా జరిగేలా పూర్తి స్థాయి భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Post a Comment