మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌పై అక్రమ ఆస్తుల కేసు
మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ మూడ్ కిషన్‌పై తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అక్రమ ఆస్తుల కేసు నమోదు చేశారు. ఈ కేసు సంబంధంగా గురువారం ఆయన నివాసంతో పాటు ఆయన బంధువులు, సహచరులకు చెందిన మొత్తం 11 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఈ సోదాల్లో మూడ్ కిషన్‌కు సంబంధించిన భారీ స్థాయి ఆస్తులను అధికారులు గుర్తించారు. వాటిలో ముఖ్యంగా నిజామాబాద్‌లోని లహరి ఇంటర్నేషనల్ హోటల్‌లో 50 శాతం వాటా, అలాగే 3000 చదరపు గజాల విస్తీర్ణంలో రాయల్ ఓక్ ఫర్నిచర్‌తో కూడిన స్థలం, అశోక టౌన్‌షిప్‌లో రెండు ఫ్లాట్లు, 10 ఎకరాల వాణిజ్య భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
అదేవిధంగా సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలంలో 31 ఎకరాల వ్యవసాయ భూమి, 4000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పాలీహౌస్ మరియు షెడ్, రెండు విలాసవంతమైన వాహనాలు — ఇన్నోవా క్రిస్టా, హోండా సిటీ —తో పాటు 1000.4 గ్రాముల బంగారు ఆభరణాలు కూడా లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.1.37 కోట్ల నగదు నిల్వలు ఉన్నట్లు తేలింది.
సోదాల్లో బయటపడిన ఈ ఆస్తుల మొత్తం విలువ దస్తావేజుల ప్రకారం సుమారు రూ.12.72 కోట్లుగా అంచనా వేయబడింది. ఈ కేసుపై ప్రస్తుతం ఏసీబీ అధికారులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
అలాగే
- వాట్సాప్ : 9440446106
- ఫేస్‌బుక్ : Telangana ACB
- ఎక్స్ (ట్విట్టర్) : @TelanganaACB
- వెబ్‌సైట్ : acb.telangana.gov.in

Post a Comment