TNGO’s మెడికల్ అండ్ హెల్త్ ఫోరమ్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు
నూతనంగా నియామకమైన తెలంగాణ నాన్ గెజెట్టెడ్ ఆఫీసర్స్ యూనియన్ (TNGO’s) మెడికల్ అండ్ హెల్త్ ఫోరమ్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలను 22-12-2025న జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా యేసు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలను పరస్పరం తెలియజేస్తూ వేడుకలు ఆనందంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (DMHO) డా. తుకారం నాయక్ హాజరై, నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులు ఐక్యతతో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ ఫోరమ్ అధ్యక్షులు కృష్ణయ్య, కార్యదర్శి ఎబినైజర్, కోశాధికారి రాకేష్ చౌదరి పాల్గొన్నారు. అదనంగా రమాదేవి (H.E), దేవి (హెడ్ నర్స్), రమేష్ బాబు (LT), ఏ. సతీష్ (LT), కె. సాగర్ (నర్సింగ్ ఆఫీసర్), జి. శశికళ (ఫార్మసిస్ట్), ప్రభాకర్ (జూనియర్ అసిస్టెంట్), రాంచందర్ (ఫార్మసిస్ట్), ప్రమీల (సీనియర్ అసిస్టెంట్), శ్రీధర్ (జూనియర్ అసిస్టెంట్), రంజిత్ కుమార్ (MPHA-M), ప్రసాద్ (జూనియర్ అసిస్టెంట్), సౌమ్య శరన్ (ఫార్మసిస్ట్) తదితరులు పాల్గొన్నారు.

Post a Comment