-->

పెద్దపల్లి–భూపాలపల్లి జిల్లాల్లో పులి సంచారం కలకలం

పెద్దపల్లి–భూపాలపల్లి జిల్లాల్లో పులి సంచారం కలకలం


పెద్దపల్లి, డిసెంబర్‌ 28: పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. శుక్రవారం సాయంత్రం వెంకటాపూర్, ఆరెంద అటవీ ప్రాంతాల్లో పులి అడుగుజాడలను అటవీ అధికారులు గుర్తించారు.

శనివారం ఉదయం ఆరెంద అటవీ ప్రాంతం నుంచి మానేరు నదిని దాటి జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామెరకుంట వైపు పులి వెళ్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

గోదావరి నది తీరంలోని ఖానాపూర్, ఎగ్లాస్పూర్, ఖాన్‌సాయిపేట, ఆరెంద, మల్లారం, స్వర్ణపల్లి, అడవి సోమనపల్లి, కాలేశ్వరం, దామెరకుంట తదితర గ్రామాల ప్రజలు, రైతులు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.

పులికి హాని కలిగించే ప్రయత్నాలు చేయవద్దని, ఎవరైనా పులి కనిపిస్తే వెంటనే అటవీ శాఖకు సమాచారం అందించాలని ఫారెస్ట్ ఆఫీసర్ శివయ్య తెలిపారు. పులి జాడ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793