-->

ఆమెతో సహజీవనం.. నిద్రిస్తున్న అన్నను గొడ్డలితో నరికి హత్య చేసిన తమ్ముడు

ఆమెతో సహజీవనం.. నిద్రిస్తున్న అన్నను గొడ్డలితో నరికి హత్య చేసిన తమ్ముడు


భిక్కనూరు: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం మోటాట్‌పల్లి గ్రామంలో శనివారం వేకువజామున చోటుచేసుకున్న హత్యా ఘటన గ్రామాన్ని భయాందోళనకు గురిచేసింది. సొంత అన్నను తమ్ముడే గొడ్డలితో నరికి, అనంతరం బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశాడు.

గ్రామానికి చెందిన ఎర్ర రాజు (32) కొంతకాలం క్రితం తన చిన్నమ్మను వెంట తీసుకొని హైదరాబాద్‌కు వెళ్లాడు. అప్పటి నుంచి వావివరసలు మరిచి ఆమెతో సహజీవనం చేస్తున్నాడని ఆరోపిస్తూ తమ్ముడు శివకుమార్ తరచూ అన్నతో గొడవపడేవాడు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి ఇంటికి వచ్చిన రాజుతో శివకుమార్ తీవ్రంగా వాగ్వాదానికి దిగాడు.

అనంతరం నిద్రిస్తున్న రాజుపై ఇంట్లో ఉన్న గొడ్డలితో దాడి చేసి, బండరాయితో కొట్టి హతమార్చాడు.

సమాచారం అందుకున్న సీఐ సంపత్ కుమార్, ఎస్ఐ ఆంజనేయులు, దోమకొండ ఎస్ఐ ప్రభాకర్, బీబీపేట ఎస్ఐ విజయ్ ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. నిందితుడు శివకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏఎస్పి చైతన్య రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

హత్య ఘటన నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ దారుణ హత్యతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793