చట్టాన్ని రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. వేతన ఒప్పందాలతో ఎలాంటి సంబంధం లేదు
గోదావరిఖని – హైదరాబాద్ : కామ్రేడ్స్, ఒకటి మాత్రం పచ్చి నిజం. చట్టాన్ని రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. దీనికి యూనియన్ వేతన ఒప్పందాలతో ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ, కొన్ని సంఘాలతో చర్చలు జరిపి సింగరేణిలో 2017 నుంచే అధికారులకు ఈ సదుపాయాన్ని అమలు చేశారు. కార్మికులకు మాత్రం 2018 నుంచి మాత్రమే అమలు చేయడం జరిగింది. ఇదే మొదటి తప్పు.
ప్రస్తుతం ప్రభుత్వం ప్రకటించిన విధానం ప్రకారం, DA/VDA 50 శాతం దాటిన వారికి 25 లక్షల వరకు ప్రయోజనం కల్పిస్తున్నారు. అయితే దీనిని పది సంవత్సరాల క్రితం నుంచి లెక్కిస్తే అధికారులకు 50 శాతం దాటిన విషయం స్పష్టంగా కనిపిస్తుంది.
అదేవిధంగా, సింగరేణి కార్మికుల విషయంలో కూడా పది సంవత్సరాల క్రితం నుంచి DA/VDA లెక్కిస్తే 50 శాతం దాటుతుందనే విషయం స్పష్టంగా ఉంది. సింగరేణిలో అధికారులు – కార్మికులు వేరువేరు కాదని, అందరూ ఒకటేనని స్పష్టం చేయదలచుకున్నాం.
ఒప్పందం ఐదేళ్లదా, పదేళ్లదా అనే అంశం పక్కన పెట్టాలి. ఇది పరిగణనలోకి వచ్చే విషయం కాదు. పది సంవత్సరాల కాలాన్ని ఆధారంగా తీసుకొని DA/VDA 50 శాతం దాటితే, అధికారులకు వర్తించిన విధంగానే కార్మికులకు కూడా 25 లక్షల ప్రయోజనం తప్పకుండా వర్తించాలి.
ఈ విధానం ప్రస్తుతం పనిచేస్తున్న కార్మికులకు మాత్రమే కాకుండా, ఇప్పటికే రిటైర్డ్ అయిన సింగరేణి కార్మికులందరికీ కూడా వర్తింపజేయాలి అని హింద్ మజ్దూర్ సభ (HMS) స్పష్టంగా డిమాండ్ చేస్తోంది.

Post a Comment