-->

బాలికల ఆత్మరక్షణకు రాణి లక్ష్మీబాయి స్వీయరక్షణ శిక్షణ కార్యక్రమం

 
బాలికల ఆత్మరక్షణకు రాణి లక్ష్మీబాయి స్వీయరక్షణ శిక్షణ కార్యక్రమం మెదక్ జిల్లాలో 162 పాఠశాలల్లో అమలు
జిల్లా విద్యాశాఖ అధికారి విజయ

మెదక్, డిసెంబర్ 24: బాలికల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు వారి భద్రతను మెరుగుపరచే లక్ష్యంతో రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ (స్వీయరక్షణ) శిక్షణ కార్యక్రమంను మెదక్ జిల్లాలో అమలు చేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి విజయ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మెదక్ జిల్లాలోని మొత్తం 162 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో 133 సెకండరీ పాఠశాలలు, 29 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయని పేర్కొన్నారు. బాలికల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ శిక్షణ తరగతులు మూడు నెలల పాటు (డిసెంబర్ 2025 నుండి మార్చి 2026 వరకు) కొనసాగుతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భాగంగా శిక్షణ అందించేందుకు కరాటేలో బ్లాక్ బెల్ట్ సర్టిఫికేట్ కలిగిన అభ్యర్థులు అర్హులని తెలిపారు. ముఖ్యంగా మహిళా అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.

అర్హతలు కలిగిన అభ్యర్థులు మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో తమ దరఖాస్తులను డిసెంబర్ 29, 2025 సాయంత్రం 5.00 గంటల లోపు సమర్పించాలని ఆయన సూచించారు.

ఈ స్వీయరక్షణ శిక్షణ కార్యక్రమం ద్వారా బాలికలు ఆత్మరక్షణలో నైపుణ్యం సాధించి, ధైర్యంగా సమాజంలో ముందుకు సాగేందుకు ఇది దోహదపడుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి విజయ ఆశాభావం వ్యక్తం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793