ఖమ్మం నగరంలో విషాదం.. సాగర్ కాలువలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి
ఖమ్మం నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానిక 53వ డివిజన్ సుల్తాన్ నగర్ ప్రాంతానికి చెందిన ఎనిమిదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థులు సాగర్ కాలువలో పడి మృతి చెందినట్లు సమాచారం.
మృతులను సుహాన్, శశాంక్గా గుర్తించారు. స్థానికుల కథనం ప్రకారం, ఇద్దరూ కలిసి ఈత కొట్టేందుకు సాగర్ కాలువలోకి దిగిన సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెవెన్యూ అధికారులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఇప్పటివరకు మృతదేహాలు లభ్యం కాలేదు.
ఈ ఘటనతో సుల్తాన్ నగర్ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొనగా, తల్లిదండ్రుల రోదనలు హృదయ విదారకంగా మారాయి. అధికారులు ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Post a Comment