రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబికి పట్టుబడిన సీనియర్ అసిస్టెంట్
ఆదిలాబాద్, బజార్ హత్నూర్: ఫిర్యాదుధారుని పేరిట ఉన్న 8.35 ఎకరాల భూమికి సాదా బైనామా రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన దస్తావేజును ప్రాసెస్ చేసి పంపించేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.2,00,000/- లంచం తీసుకుంటూ ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న కటకం విద్యాసాగర్ రెడ్డి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
లంచం తీసుకుంటున్న సమయంలో సమాచారం అందుకున్న తెలంగాణ ACB అధికారులు దాడులు నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
👉 ఫిర్యాదుధారుల / బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ACB అధికారులు స్పష్టం చేశారు.

Post a Comment