₹50 వేల లంచం తీసుకుంటూ పౌర సరఫరాల శాఖ అధికారులు ఏసీబీకి చిక్కారు
వనపర్తి, జనవరి 09: ప్రభుత్వ సీఎంఆర్ (కస్టమ్ మిల్ల్డ్ రైస్) ధాన్యాన్ని రైస్ మిల్లుకు కేటాయించేందుకు లంచం డిమాండ్ చేసిన ఘటనలో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ లిమిటెడ్‌కు చెందిన ఇద్దరు అధికారులు, ఒక ప్రైవేట్ వ్యక్తి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
వనపర్తి జిల్లాలోని ఒక రైస్ మిల్లుకు ప్రభుత్వ సీఎంఆర్ ధాన్యాన్ని కేటాయించేందుకు ఫిర్యాదుధారుని నుండి రూ.50,000 లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి వారిని అరెస్ట్ చేశారు.
ఏసీబీకి చిక్కిన వారు:
- కుంభ జగన్ మోహన్ –అసిస్టెంట్ మేనేజర్ (అకౌంట్స్),తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ లిమిటెడ్,వనపర్తి జిల్లా ఇన్‌ఛార్జ్ మేనేజర్
- లావుడ్యా లక్ష్మణ్ నాయక్ –ప్రైవేట్ డ్రైవర్
లంచం తీసుకుంటున్న సమయంలోనే ఏసీబీ అధికారులు నిందితులను పట్టుకుని, వారి వద్ద నుంచి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఏసీబీ ప్రజలకు విజ్ఞప్తి:
ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ సేవ కోసం అయినా ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా వెంటనే తెలంగాణ అవినీతి నిరోధక శాఖను సంప్రదించాలని అధికారులు సూచించారు.
👉 ఫిర్యాదుదారుల / బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.

Post a Comment