-->

6 వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన గ్రామ పంచాయతీ కార్యదర్శి

6 వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి చిక్కిన గ్రామ పంచాయతీ కార్యదర్శి


సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గానుగబండ గ్రామ పంచాయతీ కార్యదర్శి బర్పతి కృష్ణ తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులకు పట్టుబడ్డారు.

ఫిర్యాదిధారుడు నూతనంగా నిర్మించుకున్న గృహానికి ఇంటి నంబరు కేటాయించేందుకు లంచంగా రూ.6,000/- డిమాండ్ చేయగా, ఫిర్యాదిదారుడు అనిశాను ఆశ్రయించాడు. ముందస్తు పథకం ప్రకారం లంచం స్వీకరిస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు దాడి చేసి కార్యదర్శిని రంగంలోనే పట్టుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసి, తదుపరి విచారణ కొనసాగుతున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయండి:
ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు నిర్భయంగా తెలంగాణ అవినీతి నిరోధక శాఖను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు.

📞 టోల్ ఫ్రీ నెంబర్: 1064
📱 వాట్సాప్: 9440446106
📘 ఫేస్‌బుక్: Telangana ACB
ఎక్స్ (ట్విట్టర్): @TelanganaACB
🌐 వెబ్‌సైట్: acb.telangana.gov.in

➡️ ఫిర్యాదిదారుల / బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793