మేడారం మహాజాతరకు సీఎం రేవంత్ రెడ్డికి అధికారిక ఆహ్వానం
ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ ప్రసిద్ధి చెందిన అతిపెద్ద ఆదివాసీ–గిరిజన ఆధ్యాత్మిక మహోత్సవం మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో పాల్గొనాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గారికి అధికారిక ఆహ్వానం అందించారు.
ఈ మేరకు రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, ధనసరి అనసూయ (సీతక్క), పొంగులేటి శ్రీనివాస రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మేడారం ఆలయ పూజారులతో కలిసి అసెంబ్లీ ఛాంబర్‌లో ముఖ్యమంత్రిని కలసి జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ మహాజాతరకు సంబంధించిన అధికారిక పోస్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి గారు ఆవిష్కరించారు.
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ మహాజాతరను ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. భక్తులకు అన్ని మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు సమర్థవంతంగా కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

Post a Comment