-->

కొత్తగూడెంలో కాలేజీ బస్సు బోల్తా పలువురు విద్యార్థులకు గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం

కొత్తగూడెంలో కాలేజీ బస్సు బోల్తా పలువురు విద్యార్థులకు గాయాలు ఇద్దరి పరిస్థితి విషమం


భద్రాద్రి కొత్తగూడెం, జనవరి 02: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కాలేజీ విద్యార్థులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

వివరాల్లోకి వెళ్తే… కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట అటవీ ప్రాంతంలో ఉన్న ఎర్రమ్మ తల్లి గుడి వద్ద కేఎల్‌ఆర్ కాలేజీకి చెందిన బస్సు శుక్రవారం ఉదయం ప్రమాదానికి గురైంది. మణుగూరు నుంచి పాల్వంచకు వెళ్తున్న సమయంలో బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది.

ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో సుమారు 60 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిసింది. బస్సు బోల్తా పడటంతో పలువురు విద్యార్థులు బస్సు కింద ఇరుక్కుపోయారు. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి విద్యార్థులను బయటకు తీసి అంబులెన్సుల ద్వారా ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793