-->

7,500 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మండల సర్వేయర్‌

7,500 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మండల సర్వేయర్‌


నిర్మల్ జిల్లా, నిర్మల్ గ్రామీణ మండల తహశీల్దార్ కార్యాలయంలో మండల సర్వేయర్‌గా పనిచేస్తున్న ఎన్. బాలకృష్ణవర్మ తెలంగాణ అవినీతినిరోధక శాఖ (ACB) అధికారులకు చిక్కాడు.

ఫిర్యాదుదారుని బంధువుకు సంబంధించిన భూమికి హద్దులు నిర్ణయించి పంచనామా అప్పగించేందుకు ముందుగా రూ.15,000 లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఇప్పటికే రూ.5,000 లంచంగా తీసుకున్న బాలకృష్ణవర్మ, మిగిలిన మొత్తంలో నుంచి రూ.7,500ను తన ప్రైవేటు సహాయకుడు పోల నాగరాజు ద్వారా తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ చేపట్టారు.

లంచం అడిగితే వెంటనే ఫిర్యాదు చేయండి

ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు వెంటనే తెలంగాణ అవినీతినిరోధక శాఖను సంప్రదించాలని ఏసీబీ అధికారులు సూచించారు.

  • టోల్ ఫ్రీ నెంబర్: 1064
  • వాట్సాప్: 9440446106
  • ఫేస్‌బుక్: Telangana ACB
  • ఎక్స్ (ట్విట్టర్): @TelanganaACB
  • వెబ్‌సైట్: acb.telangana.gov.in

👉 ఫిర్యాదుదారుల మరియు బాధితుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయి అని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793