కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌లో 54వ డివిజన్ కార్పొరేటర్‌గా జయంతి మసూద్ ప్రమాణ స్వీకారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో 54వ డివిజన్‌కు చెందిన కార్పొరేటర్‌గా రాజనలిని జయంతి తొగరు మసూద్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో రెండోసారి ఘనవిజయం సాధించిన ఆమె, ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు.
గతంలో కౌన్సిలర్‌గా సేవలందించిన జయంతి మసూద్, తన పదవీకాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసి ప్రజల విశ్వాసాన్ని సంపాదించారు. మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సమస్యల పరిష్కారం, వీధి దీపాల ఏర్పాటు వంటి అంశాల్లో ప్రత్యేక దృష్టి సారించడం వల్ల 54వ డివిజన్‌లో మంచి పేరు తెచ్చుకున్నారు. అదే నమ్మకంతో ఈసారి కూడా ప్రజలు ఆమెకు మద్దతు తెలిపి తిరిగి గెలిపించారు.
ప్రమాణ స్వీకారం అనంతరం జయంతి మసూద్ మాట్లాడుతూ, “నా మీద విశ్వాసం ఉంచి మరల కార్పొరేటర్‌గా గెలిపించిన 54వ డివిజన్ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేసి డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాను” అని తెలిపారు. అలాగే తన విజయానికి కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో 54వ డివిజన్ ప్రజలు హాజరై జయంతి మసూద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త పదవీకాలంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సేవలందిస్తానని ఆమె హామీ ఇచ్చారు.

Post a Comment