మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం.. మంథని జెడ్పీ స్కూల్ అసిస్టెంట్ సస్పెండ్
పెద్దపల్లి జిల్లా, ఫిబ్రవరి 12: పెద్దపల్లి జిల్లా మంథని జెడ్పీ హైస్కూల్ (బాలికలు)లో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ కొమురాజు శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాధికారి (డీఈఓ) శారద బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మంథని మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నట్లు ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టారు. సోషల్ మీడియా పోస్టులు, ప్రెస్ క్లిప్పింగ్‌ల ఆధారంగా మండల విద్యాధికారి (ఎంఈవో) విచారణ జరిపి నివేదిక సమర్పించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
విచారణ నివేదిక ఆధారంగా సేవా నియమావళిని ఉల్లంఘించినట్లు తేలడంతో శ్రీనివాస్‌పై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు డీఈఓ స్పష్టం చేశారు. ఈ ఘటన జిల్లాలో విద్యాశాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
జగిత్యాలలో మహిళ మెడలోంచి రెండు తులాల పుస్తెలతాడు లాక్కెళ్లిన దొంగలు
పట్టణానికి చెందిన గట్ల శైలజ నడుచుకుంటూ వెళ్తుండగా, ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి ఒక్కసారిగా ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడును లాక్కెళ్లారు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడేలోపే దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు.
సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment