కీలక సర్క్యూలర్ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కీలక సర్క్యూలర్‌ను జారీ చేసింది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల తరఫున ఎన్నికైన సభ్యులు పార్టీ విప్‌ను తప్పనిసరిగా పాటించాల్సిందేనని, విప్‌ను ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 16న ప్రత్యేక కౌన్సిల్ సమావేశాలు
ఈ నెల 16వ తేదీన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక కౌన్సిల్ సమావేశాలు నిర్వహించనున్నారు.
- మున్సిపల్ కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్
- మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరగనున్నాయి.
విప్ ధిక్కరిస్తే అనర్హత తప్పదు
రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన సర్క్యూలర్ ప్రకారం:
- పార్టీ విప్‌ను ధిక్కరించిన సభ్యుడి వివరాలను, ఎన్నిక జరిగిన తేదీ నుంచి మూడు రోజుల్లోపు పార్టీ విప్‌గా నియమితుడైన వ్యక్తి జిల్లా కలెక్టర్ ద్వారా గుర్తించబడిన అధికారికి రాతపూర్వకంగా నివేదించాలి.
- నివేదిక అందిన అనంతరం సంబంధిత సభ్యుడికి షోకాజ్ నోటీసు జారీ చేయాలి.
- నోటీసు తేదీ నుంచి ఏడు రోజులలోపు వివరణ ఇవ్వాలని కోరాలి.
రెండు రోజుల్లో తుది ఉత్తర్వులు
- సభ్యుడు ఇచ్చిన వివరణను పరిగణనలోకి తీసుకుని, జిల్లా కలెక్టర్ చేత గుర్తించబడిన అధికారి రెండు రోజుల్లోపు తుది ఉత్తర్వులు జారీ చేయాలి.
- ఏడు రోజుల గడువులో వివరణ ఇవ్వకపోతే, అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగా రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
- విప్‌ను ఉల్లంఘించినట్లు తేలితే సభ్యత్వం రద్దు చేసే అవకాశం ఉంటుంది.
ఎన్నికల అధికారులకు శిక్షణ
రూ.2.02 కోట్ల విలువైన సామగ్రి సీజ్
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) అమల్లో భాగంగా భారీగా నగదు, ఇతర వస్తువులను అధికారులు సీజ్ చేశారు.
సీజ్ చేసిన వివరాలు:
- నగదు: రూ.89.30 లక్షలు
- లిక్కర్: రూ.84.89 లక్షలు
- డ్రగ్స్, నార్కోటిక్స్: రూ.13.27 లక్షలు
- బంగారం, వెండి: రూ.14.69 లక్షలు
- ట్యాబ్స్ & ఇతర వస్తువులు: రూ.78 వేలు
మొత్తం సీజ్ విలువ రూ.2.02 కోట్లుగా ఎన్నికల అధికారులు వెల్లడించారు.

Post a Comment