మీడియా అకాడమీ చైర్మన్ పదవీకాలం పొడిగింపు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
Telangana ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మీడియా అకాడమీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ K. Srinivas Reddy పదవీకాలాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 2024 ఫిబ్రవరి 26న రెండేళ్ల కాలానికి గాను తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా కె. శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. జర్నలిజం రంగంలో సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం మరియు సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించారు.
జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాలు, హెల్త్ కార్డులు తదితర సంక్షేమ పథకాల అమలులో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో, ఆయన మరో రెండేళ్ల పాటు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా కొనసాగనున్నారు.

Post a Comment