భార్య మున్సిపల్ చైర్మన్.. భర్త వైస్ చైర్మన్ – అశ్వారావుపేటలో అరుదైన ఘట్టం
అశ్వారావుపేట: అశ్వారావుపేట పురపాలక సంఘంలో అరుదైన రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను అధిష్టించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని అశ్వారావుపేట మున్సిపాలిటీలో మొత్తం 22 వార్డుల్లో 17 వార్డులను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో మున్సిపల్ పీఠం కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లింది. 13వ వార్డు నుంచి కాంగ్రెస్ నేత జూపల్లి రమేష్ బాబు, 6వ వార్డు నుంచి ఆయన సతీమణి జూపల్లి శశికళ కౌన్సిలర్లుగా విజయం సాధించారు.
మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల అధికారి కార్తీక్ సమక్షంలో జూపల్లి దంపతులు కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జరిగిన ప్రత్యేక సమావేశంలో మెజారిటీ సంఖ్యాబలంతో జూపల్లి శశికళను మున్సిపల్ చైర్మన్‌గా, జూపల్లి రమేష్ బాబును వైస్ చైర్మన్‌గా ఎన్నిక చేశారు.
ఇటీవలే ఏర్పడిన అశ్వారావుపేట మున్సిపాలిటీలో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ఒకే ఇంటి నుంచి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కడం ప్రత్యేకతగా నిలిచింది. జూపల్లి దంపతుల విజయం నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు, అనుచరులు సంబరాలు జరుపుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు.

Post a Comment