-->

పవిత్ర రంజాన్ మాసానికి స్వాగతం పలికిన జమాతే ఇస్లామి హింద్ మహిళా విభాగం

పవిత్ర రంజాన్ మాసానికి స్వాగతం పలికిన జమాతే ఇస్లామి హింద్ మహిళా విభాగం


రామవరం–రుద్రంపూర్: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని జమాతే ఇస్లామి హింద్ మహిళా విభాగం ఆధ్వర్యంలో చుంచుపల్లి మండలం రామవరం అల్ హుదా ఇస్లామిక్ సెంటర్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షురాలు సఫూరా మాట్లాడుతూ, మనిషిని నిజమైన మానవత్వపు విలువలతో తీర్చిదిద్దేందుకే సృష్టికర్త అల్లాహ్ ఉపవాసాలను తప్పనిసరిగా విధించాడని తెలిపారు. ఉపవాసాల అసలు ఉద్దేశం అల్లాహ్ యెడల భయభక్తులను పెంపొందించడమేనని ఆమె అన్నారు.

అనంతరం రుద్రంపూర్–రామవరం అధ్యక్షురాలు మాట్లాడుతూ, మానవాళికి మార్గదర్శిగా నిలిచే, మానవ జీవిత మర్మాన్ని వివరించే దైవవాక్య గ్రంథం ఖుర్ఆన్ అవతరించిన పవిత్ర నెలే రంజాన్ అని తెలిపారు. ఆకలి విలువను తెలుసుకుని సమాజంలోని పేదలు, అవసరాలున్నవారిపై సానుభూతి కలిగించే శిక్షణ ఇచ్చే మాసం రంజాన్ అని ఆమె పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో షాహిన్, అప్సరి, షాహేదా, షమీం, ముస్లిం మహిళలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793