లక్షేట్టిపేటలో దొంగనోట్ల చెలామణి అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్
లక్షేట్టిపేట: పట్టణంలో కలకలం రేపిన దొంగనోట్ల చెలామణి వ్యవహారంలో అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను శనివారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రకాష్ వెల్లడించారు.
ఏసీపీ వివరాల ప్రకారం, మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల పెట్రోల్ బంక్‌లో బుధవారం ఒక స్విఫ్ట్ కారులో వచ్చిన కానుగంటి క్రాంతి కుమార్ రూ. 1,500 విలువైన పెట్రోల్ కొట్టించుకుని వెళ్లాడు. అనంతరం బంక్ సిబ్బంది పరిశీలించగా, అతడు ఇచ్చిన నోట్లు నకిలీవని గుర్తించారు. వెంటనే యజమాని ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు ప్రారంభమైంది.
ప్రధాన నిందితులు
ఈ దొంగనోట్ల చెలామణి కేసులో:
- ఏ1: కానుగంటి క్రాంతి కుమార్ – రియల్ ఎస్టేట్ వ్యాపారి, ఇటిక్యాల
- ఏ2: గడికొప్పుల రవీందర్ – ఆటో డ్రైవర్, లక్షేట్టిపేట
- ఏ3: తాండ్ర ప్రకాష్ – ఆర్కె 6, శ్రీరాంపూర్
- ఏ4: కొంక మధుకర్ – వెంకట్రావ్ పేట్
- ఏ5: సుంకే సురేష్ – గోదావరిఖని
- ఏ6: కామిని అనిల్ – సుల్తానాబాద్
వీరు కాకినాడ నుంచి నకిలీ కరెన్సీ తెచ్చి స్థానికంగా చెలామణి చేస్తున్నట్లు విచారణలో తేలిందని ఏసీపీ తెలిపారు.
స్వాధీనం చేసిన నగదు, వస్తువులు
కాకినాడకు చెందిన రాము, రవిల నుంచి రూ. 5,98,500 విలువైన నకిలీ కరెన్సీ తెచ్చి చెలామణి చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా పోలీసులు:
- రూ. 5,98,500 నకిలీ కరెన్సీ
- 3 కార్లు
- 12 సెల్‌ఫోన్లు
స్వాధీనం చేసుకున్నారు.
ఇతర నిందితులు
- ఏ7: రాం నాయక్ – బెంగులూరు బేకరీ, లక్షేట్టిపేట
- ఏ8: నాగునూరి రాము – మోదేలా, లక్షేట్టిపేట
- ఏ9: దేవబోయిన సంపత్ – బెజ్జంకి, సిద్దిపేట జిల్లా
- ఏ10: కడమండ్ల తిరుపతి – జెండా వెంకటాపూర్
- ఏ11: గోళ్ళ కుమారస్వామి – పెర్కపల్లి, పెద్దపల్లి జిల్లా
- ఏ12: బండారి సత్యనారాయణ – రంగపేట, లక్షేట్టిపేట
కాగా ఏ13 రాము, ఏ14 రవి పరారీలో ఉన్నారని తెలిపారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
ప్రత్యేక నిఘా
కాకినాడ నుంచి జరుగుతున్న నకిలీ నోట్ల రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఏసీపీ వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద నోట్లను వెంటనే పోలీసులకు అందించాలని కోరారు.
ఈ కేసును చాకచక్యంగా చేధించిన లక్షేట్టిపేట సీఐ రమణమూర్తి, ఎస్సైలు గోపతి సురేష్, దండేపల్లి ఎస్సై తాసోద్దిన్ మరియు సిబ్బందిని ఏసీపీ అభినందించారు.

Post a Comment