-->

ఓసీపీ-1 ఉద్యోగుల పదవీ విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా

ఓసీపీ-1 ఉద్యోగుల పదవీ విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా


పెద్దపల్లి జిల్లా ఓసీపీ-1లో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వింజపురి అంజయ్య (ఫోర్‌మెన్), బొగ్గు రామస్వామి (ఈ.పీ. ఆపరేటర్)లను సన్మానించారు.

ఈ సందర్భంగా హింద్ మజ్దూర్ సభ (HMS) జాతీయ కార్యదర్శి ఖాజీ మహమ్మద్ ఇస్మాయిల్ నిజామీ శాలువాలు కప్పి, మెమెంటోలు అందజేసి, రంజాన్ మాసం ప్రత్యేక “గీటురాయి” సంచికను బహుకరించారు.

ఈ కార్యక్రమంలో హెచ్‌ఎంఎస్ నాయకులు శాంతి స్వరూప్, మల్లారెడ్డి, పెసర స్వామి సాబీర్, బుగ్గజి తదితరులు పాల్గొన్నారు. అలాగే పదవీ విరమణ పొందిన మాజీ ఉద్యోగులు, సహచరులు హాజరై వారికి అభినందనలు తెలిపారు.

సంస్థ అభివృద్ధికి విశేష సేవలు అందించిన ఉద్యోగులను సన్మానించడం ఆనందంగా ఉందని నాయకులు పేర్కొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793