-->

తిమ్మన్నపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం

తిమ్మన్నపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి.. పలువురి పరిస్థితి విషమం


నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం తిమ్మన్నపల్లి స్టేజీ సమీపంలోని జాతీయ రహదారి 167 పై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్నాటక నుంచి శ్రీశైలం దేవస్థానం దర్శనానికి వెళ్తున్న క్రూజర్ వాహనం అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కర్నాటక రాష్ట్రంలోని విజయపురి జిల్లా యాదగిరి గ్రామానికి చెందిన భక్తులు శ్రీశైలం దర్శనానికి బయలుదేరారు. మార్గమధ్యంలో వాహనం అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో రాంరెడ్డి దేశారు (52), ఆయన భార్య మేఘనా రెడ్డి (48), కల్కేరి గ్రామానికి చెందిన మహాదేవి (65) అక్కడికక్కడే మృతి చెందారు.

క్షతగాత్రులను వెల్దండ మండల కేంద్రంలోని ఎంఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మల్లమ్మ, శివమణి అప్పల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. డ్రైవర్ రాము స్వల్ప గాయాలతో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఊర్కొండ ఎస్సై కృష్ణదేవ్ మృతదేహాలను కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793