-->

ఖమ్మం వెలుగుమట్ల బుదాన్ భూముల బాధితులకు అండగా బీఆర్ఎస్

ఖమ్మం వెలుగుమట్ల బుదాన్ భూముల బాధితులకు అండగా బీఆర్ఎస్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హామీ


ఖమ్మం జిల్లాలోని వెలుగుమట్ల బుదాన్ భూముల్లో ఇళ్లను నిర్మించుకుని నివసిస్తున్న పేదల ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయంగా కూల్చివేసి వారిని రోడ్డున పడేసిందని మాజీ మంత్రి Puvvada Ajay Kumar ఆరోపించారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తిస్థాయిలో అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

బాధితులను పరామర్శించేందుకు ఖమ్మం వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ K. T. Rama Rao (కేటీఆర్) వారికి న్యాయం చేయడానికి హైకోర్టులో పోరాటం చేస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తామని భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే.

ఆ హామీ మేరకు ఆదివారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుదాన్ బాధితులను పిలిపించి బీఆర్ఎస్ హైదరాబాద్ లీగల్ సెల్ సభ్యులతో సమావేశమయ్యారు. బాధితుల తరఫున కోర్టులో పోరాడేందుకు న్యాయపరమైన చర్యలు ప్రారంభిస్తున్నామని తెలిపారు. ఎవరూ అధైర్యపడవద్దని, పార్టీ పూర్తిస్థాయిలో అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, లీగల్ సెల్ అడ్వకేట్ మేకల సుగుణరావు, మాజీ డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, బుదాన్ బాధితుల సంఘ నాయకులు దేవాళ్ళ వీరన్న, సంపంగి వెంకటేశ్వర్లు, సంపంగి వెంకటాచలం, బండి శ్రీను, పుప్పాల శ్రీను, జారా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793