-->

బైక్‌ అదుపుతప్పి కాల్వలో పడిన బైక్‌.. ఇద్దరు గల్లంతు

 

బైక్‌ అదుపుతప్పి కాల్వలో పడిన బైక్‌.. ఇద్దరు గల్లంతు

కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బైక్‌ అదుపుతప్పి కాల్వలో పడిపోవడంతో యువతీ యువకుడు గల్లంతయ్యారు. ఈ ఘటన మెట్‌పల్లి మండలంలోని పెద్దాపూర్‌ గ్రామ సమీపంలో గురువారం జరిగింది.

స్థానికుల వివరాల ప్రకారం, కాల్వలో బైక్‌ కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బైక్‌ను బయటకు తీశారు. రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టగా, మెట్‌పల్లి మండలం వెల్లుల్ల గ్రామానికి చెందిన బొదాసు లావణ్య, అలాగే మెట్‌పల్లికి చెందిన అంకుశ్‌ కలిసి బైక్‌పై ప్రయాణించినట్లు గుర్తించారు.

లావణ్య బైక్‌ నడుపుతుండగా, అంకుశ్‌ వెనుక కూర్చున్నట్లు సమాచారం. కాల్వ వద్దకు చేరుకునే సమయంలో బైక్‌ అదుపుతప్పి నీటిలో పడిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

కాల్వలో గల్లంతైన లావణ్య, అంకుశ్‌ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని కోరుట్ల సీఐ సురేశ్‌బాబు, ఎస్సై చిరంజీవి తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793