పెళ్లి చేసుకుందన్న కోపంతో మహిళపై కత్తి దాడి
హైదరాబాద్: మేడ్చల్–మల్కాజ్‌గిరి పెళ్లి చేసుకుందన్న కోపంతో మహిళపై కత్తి దాడి మియాపూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనను పెళ్లి చేసుకోకుండా మరో వ్యక్తిని వివాహం చేసుకుందన్న కోపంతో ఓ వ్యక్తి మహిళపై కత్తితో దాడి చేశాడు.
కాకినాడకు చెందిన నూకరత్నం అనే మహిళ మియాపూర్‌లో హౌస్‌కీపింగ్ పనులు చేస్తూ జీవిస్తోంది. గతంలో భర్తను కోల్పోయిన ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల ఆమె ప్రసాద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
అదే చోట వంటమనిషిగా పనిచేస్తున్న ఆలీషా అలియాస్ పాండు, ఈ విషయంపై తీవ్ర అసహనం పెంచుకున్నాడు. ఈ నెల 19న తన తండ్రి లాలూ, స్నేహితుడు జాన్‌తో కలిసి నూకరత్నం ఇంటికి వెళ్లి తన వెంట రావాలని బలవంతం చేశాడు. ఆమె నిరాకరించడంతో ఆగ్రహానికి లోనై ముందుగానే తీసుకెళ్లిన కత్తితో దాడి చేశాడు.
దాడిలో నూకరత్నం తీవ్రంగా గాయపడగా, స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడు ఆలీషా మరియు అతని తండ్రి లాలూను అరెస్ట్ చేశారు.
👉 ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన కలిగించింది.

Post a Comment