-->

ములుగు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం

ములుగు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు కలకలం


newsupta9 : న్యూస్ ప్రతినిధి: ములుగు జిల్లా, మార్చి 23: ములుగు జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఈమెయిల్ ద్వారా కోర్టు ప్రాంగణంలో బాంబు పెట్టినట్లు హెచ్చరిక పంపించారు.

ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లా కోర్టులకు వరుసగా ఇలాంటి బెదిరింపులు వస్తుండగా, తాజాగా ములుగు కోర్టును లక్ష్యంగా చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

బెదిరింపు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారు. కోర్టు ప్రాంగణాన్ని ఖాళీ చేయించి, భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రతి మూలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

ఈ ఘటనతో కోర్టు పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎటువంటి అనుమానాస్పద వస్తువులు ఉన్నాయా అనే దానిపై అధికారులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.

వరుస బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ, ఈమెయిల్ పంపిన వ్యక్తుల గుర్తింపుపై దర్యాప్తు చేపట్టారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793