-->

శ్రీరామనవమి సందర్భంగా మజ్జిగ, దద్దోజనం, పానకం పంపిణీ

 

శ్రీరామనవమి సందర్భంగా మజ్జిగ, దద్దోజనం, పానకం పంపిణీ చేసిన 54వ కార్పొరేటర్ జయంతి మసూద్

భద్రాద్రి కొత్తగూడెం : మార్చి 27: శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని 54వ డివిజన్ కార్పొరేటర్ జయంతి మసూద్, ముస్లింల ఆధ్వర్యంలో భక్తులకు ఉచితంగా మజ్జిగ, దద్దోజనం, కేసరి, మినరల్ వాటర్, పానకం పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ప్రాంతీయ ప్రజలతో పాటు భక్తుల నుండి విశేష స్పందనను పొందింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ జయంతి మసూద్ మాట్లాడుతూ, శ్రీరామనవమి పర్వదినం సమాజంలో ఐక్యత, సౌహార్దాన్ని పెంపొందించే పండుగ అని తెలిపారు. ప్రజలకు సేవ చేయడం తమ బాధ్యతగా భావించి ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భక్తులకు చల్లని పానీయాలు, తినుబండారాలు అందించడం ఎంతో అవసరమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్కే మసూద్, అబ్దుల్ సలాం, అబ్దుల్ సత్తార్, మొహమ్మద్ అజీమ్, మొహమ్మద్ అన్వర్, మొహమ్మద్ గౌస్, మొహమ్మద్ ముజ్జు, మహమ్మద్ ఖదీర్, ఇషాక్, జావిద్, అహ్మద్, మసీద్, కిట్టు, ఎస్కే ఖాదర్, దావుద్, అన్వర్, మొహమ్మద్ నయీమ్, ఎస్.కే యాకూబ్, ఎండి ఆరిఫ్ తదితరులు పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.

భక్తులు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793