-->

లక్ష్మీదేవిపల్లి SBI బ్రాంచ్ ద్వారా రూ.40 లక్షల ఇన్సూరెన్స్ చెక్ పంపిణీ

లక్ష్మీదేవిపల్లి SBI బ్రాంచ్ ద్వారా రూ.40 లక్షల ఇన్సూరెన్స్ చెక్ పంపిణీ


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్రాంచ్ ఆధ్వర్యంలో ఒక మానవీయ కార్యక్రమం జరిగింది. రైల్వే ఉద్యోగి జేజుల విజయ్ కుమార్ ప్రమాదవశాత్తు మరణించగా, ఆయన కుటుంబానికి బ్యాంక్ ద్వారా రూ.40 లక్షల ఇన్సూరెన్స్ చెక్కును అందజేశారు.

మరణించిన విజయ్ కుమార్ జీతం లక్ష్మీదేవిపల్లి SBI బ్రాంచ్ ద్వారా పొందుతూ ఉండటంతో, బ్యాంక్‌కు సంబంధించిన ఇన్సూరెన్స్ పథకం ప్రకారం ఆయన భార్య జే. శోభ రాణికి ఈ ఆర్థిక సాయం అందించారు. ఈ చెక్కును SBI రీజినల్ మేనేజర్ మిద్దెల సత్యనారాయణ అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులు SBI ద్వారా జీతం పొందడం వల్ల ఇన్సూరెన్స్ ప్రయోజనాలు లభిస్తాయని, ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబాలకు ఈ విధంగా ఆర్థిక అండగా నిలుస్తుందని తెలిపారు. గతంలో రూ.40 లక్షలుగా ఉన్న ఇన్సూరెన్స్ మొత్తం ప్రస్తుతం రూ.1 కోటికి పెంచినట్లు కూడా వెల్లడించారు.

డివిజనల్ ప్రెసిడెంట్ ఎస్.కె. ఖాజా బాబా మాట్లాడుతూ, SBI అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని తెలిపారు. అలాగే రైల్వే పెన్షన్ పొందుతున్న వారికి కూడా ఇన్సూరెన్స్ వర్తించేలా చూడాలని, సహజ మరణాలకూ ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవిపల్లి SBI బ్రాంచ్ మేనేజర్ జి. పవన్ కుమార్, AIRESCST సెక్రటరీ బి. బాద్య నాయక్, SCRMU BDCR కోశాధికారి కె. వెంకటేశ్వర్లు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793