-->

10వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి పట్టుబడిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అరెస్ట్

10వేలు లంచం తీసుకుంటూ ఏసీబికి పట్టుబడిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అరెస్ట్


పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండల తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి ఘటన వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI)గా పనిచేస్తున్న సెడంక శ్రీమాన్‌ను తెలంగాణ అవినీతి నిరోధకశాఖ (ACB) అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఫిర్యాదుదారుని తల్లికి చెందిన భూమిపై ‘భూ భారతి చట్టం-2025’ కింద క్షేత్రస్థాయి విచారణ చేసి తహసీల్దార్‌కు నివేదిక సమర్పించేందుకు రూ.10,000 లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితుడు ఫిర్యాదు చేయడంతో ACB అధికారులు ఉచ్చుపట్టి, తహసీల్దార్ కార్యాలయంలోనే డబ్బులు తీసుకుంటుండగా నిందితుడిని పట్టుకున్నారు.

అధికారిని అదుపులోకి తీసుకున్న ACB అధికారులు తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

ప్రజలకు సూచన: ఏ ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగినా వెంటనే ఫిర్యాదు చేయాలని ACB సూచించింది. టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు కాల్ చేయవచ్చు. అలాగే వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB), వెబ్‌సైట్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అధికారులు తెలిపారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793