-->

20 మంది మృతి.. వేదాంత గ్రూప్ ఛైర్మన్‌పై కేసు నమోదు

20 మంది మృతి.. వేదాంత గ్రూప్ ఛైర్మన్‌పై కేసు నమోదు


ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లా పరిధిలో ఉన్న Vedanta Group పవర్ ప్లాంట్‌లో జరిగిన ఘోర పేలుడు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో వేదాంత గ్రూప్ ఛైర్మన్ Anil Agarwal సహా పలువురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ నెల 14న సింగితరాయ్ ప్రాంతంలోని ప్లాంట్‌లో జరిగిన ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనతో ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది.

ఈ కేసును దాబ్రా పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 106, 289, 3(5) కింద నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ ప్రఫుల్ ఠాకూర్ తెలిపారు. ఛైర్మన్ అనిల్ అగర్వాల్‌తో పాటు మరో 8 నుంచి 10 మంది పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు నిపుణులతో కూడిన సాంకేతిక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్ నివేదికలు రావాల్సి ఉండగా, అవి అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. దర్యాప్తు కొనసాగుతుండగా, బాధ్యులపై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793