-->

పిరమైన కూరగాయల ధరలు – సామాన్యులపై భారం

పిరమైన కూరగాయల ధరలు – సామాన్యులపై భారం


హైదరాబాద్: ఏప్రిల్ 16: ఉన్నట్లుండి కూరగాయల ధరలు అమాంతం పెరగడంతో సామాన్య ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. “ఏం కొనాలి? ఏమి తినాలి?” అన్న సందిగ్ధంలో పడుతున్నారు. అకాల వర్షాల కారణంగా పంటలకు నష్టం జరగడం, వేసవి కాలంలో సరఫరా తగ్గడం వల్ల ధరలు ఒక్కసారిగా ఎగబాకుతున్నాయి. కొన్నిచోట్ల వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి ధరలను పెంచుతున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో కూరగాయల ధరలు దాదాపు రెండింతలు పెరిగిన పరిస్థితి ఉంది.

టమాటా ధరలు మళ్లీ పెరుగుదల బాట పట్టాయి. ఇటీవల కిలో రూ.10కి లభించిన టమాటా, ప్రస్తుతం రూ.20కిపైగా అమ్ముడవుతోంది.

ప్రస్తుతం హైదరాబాద్ కూకట్‌పల్లి రైతు బజార్‌లో ధరలు ఇలా ఉన్నాయి:

  • టమాటా – రూ.23/kg
  • వంకాయ – రూ.18/kg
  • బెండకాయ – రూ.35/kg
  • పచ్చిమిర్చి – రూ.40/kg
  • బజ్జిమిర్చి – రూ.21/kg
  • కాకరకాయ – రూ.32/kg
  • బీరకాయ – రూ.35/kg
  • క్యాబేజీ – రూ.11/kg
  • బీన్స్ – రూ.60/kg
  • క్యారెట్ – రూ.23/kg
  • గోబి (కాలీఫ్లవర్) – రూ.25/kg
  • దొండకాయ – రూ.23/kg
  • చిక్కుడుకాయ – రూ.50/kg
  • గోరుచిక్కుడు – రూ.28/kg

ఇతర కూరగాయలు:

  • బీట్‌రూట్ – రూ.23/kg
  • క్యాప్సికం – రూ.33/kg
  • ఆలుగడ్డ – రూ.17/kg
  • కీర – రూ.18/kg
  • దోసకాయ – రూ.13/kg
  • సొరకాయ – రూ.15/kg
  • పొట్లకాయ – రూ.18/kg
  • కంద – రూ.30/kg
  • ఉల్లిపొరక – రూ.40/kg
  • ఉల్లిగడ్డ – రూ.18/kg
  • చామగడ్డ – రూ.28/kg
  • చిలకడదుంప – రూ.25/kg
  • పచ్చిబఠాణి – రూ.40/kg
  • బొప్పాయి – రూ.40/kg
  • పుట్టగొడుగులు – రూ.45/kg
  • ఎండుమిర్చి – రూ.260/kg

మొత్తంగా:
ధరల పెరుగుదలతో మధ్యతరగతి, పేద కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793