-->

తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ?

తెలంగాణలో అతి త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ?


హైదరాబాద్ : ఏప్రిల్ 16: రాష్ట్రంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

దాదాపు రెండున్నర సంవత్సరాలుగా ఖాళీగా ఉన్న పలు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, ఫెడరేషన్లకు చైర్‌పర్సన్‌లు మరియు ఇతర నామినేటెడ్ పదవులను భర్తీ చేసే దిశగా ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. మొదటి దశలోనే 17 చేతివృత్తుల కుల సంఘాలకు చైర్‌పర్సన్‌లను నియమించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల్లో ఆశలు పెరిగాయి. పదవుల కోసం ఇప్పటికే లోబీయింగ్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రం జరిగిన కీలక సమావేశంలో మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొని నామినేటెడ్ పోస్టుల భర్తీ, అభ్యర్థుల ఎంపికపై సమగ్రంగా చర్చించారు.

పార్టీ కోసం కష్టపడ్డ నాయకులను గుర్తించి వారికి ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టంచేసినట్లు సమాచారం. అలాగే సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యం ఇస్తూ అన్ని వర్గాలకు న్యాయం చేసేలా నియామకాలు చేపట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.

అన్ని వర్గాలను పరిగణలోకి తీసుకుని, సమతుల్యంగా ఆశావహుల జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793