-->

తెనాలి చెంచుపేటలో న్యూడ్ వీడియో కాల్స్ దందా వెలుగులోకి

తెనాలి చెంచుపేటలో న్యూడ్ వీడియో కాల్స్ దందా వెలుగులోకి


గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని చెంచుపేట కేంద్రంగా న్యూడ్ వీడియో కాల్స్ దందా బయటపడింది. ఈ వ్యవహారంలో నిర్వాహకులుగా ఉన్న ముగ్గురు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అక్రమ కార్యకలాపాలు గత రెండేళ్లుగా కొనసాగుతున్నట్లు విచారణలో వెల్లడైంది.

పోలీసుల సమాచారం ప్రకారం, పట్టణ పరిధిలోని పాండురంగపేట, చెంచుపేట ప్రాంతాలకు చెందిన మహిళలు చెంచుపేటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని, ఇతర మహిళలను అక్కడికి రప్పించి న్యూడ్ వీడియో కాల్స్ చేయించేవారు. ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ఈ కాల్స్ నిర్వహిస్తూ భారీగా డబ్బు సంపాదిస్తున్నట్టు తెలిసింది.

“స్ట్రిప్‌టాక్” అనే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లో లాగిన్ అయి, విదేశాల నుంచి కూడా వినియోగదారులు నగదు చెల్లించి లైవ్‌లో మహిళలతో వీడియో కాల్స్‌లో పాల్గొనే విధంగా వ్యవస్థ నడుస్తోంది. నిర్వాహకులు “స్వీటీ”, “క్యూటీ” పేర్లతో ఖాతాలు సృష్టించి ఈ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మొదట మాస్క్‌తో చాట్ చేసి, చెల్లింపు పూర్తయ్యాక న్యూడ్ కాల్స్ నిర్వహించే విధానం అనుసరించేవారని సమాచారం.

సులభంగా డబ్బు సంపాదన పేరుతో మోసం

ఒక గదిలో ఉండి వీడియో కాల్‌లో పాల్గొంటే రూ.500 నుంచి రూ.1000 వరకు ఇస్తామని చెప్పి మహిళలు, యువతులను ఈ దందాలోకి దింపుతున్నట్లు వెల్లడైంది. ఈ నెట్‌వర్క్‌లో సుమారు 80 నుంచి 100 మంది మహిళలు ఉన్నారని, రోజుకు కొంతమంది ఈ కాల్స్ కోసం వచ్చి వెళ్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ వ్యవహారంలో ఒక యువకుడు కీలక పాత్ర పోషిస్తున్నట్లు భావిస్తున్నారు. నిర్వాహక మహిళలు 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉండటంతో సాంకేతిక పరిజ్ఞానం పరిమితంగా ఉండవచ్చని, ఆన్‌లైన్ లాగిన్‌లు, ట్రాన్సాక్షన్లు, మహిళలను తరలించడం వంటి పనులను ఆ యువకుడే నిర్వహిస్తున్నాడని పోలీసులు భావిస్తున్నారు.

ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793