తెలంగాణ జాగృతి కార్యాలయం – అజ్మీర్ దర్గాకు చాదర్ పంపిన కవిత
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతంలో ఉన్న తెలంగాణ జాగృతి కార్యాలయంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజస్థాన్‌లోని ప్రసిద్ధ అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ పంపించారు.
కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు నేపథ్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కవిత ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మైనార్టీ నాయకులకు చాదర్‌ను అందజేసి, వారు అజ్మీర్‌కు వెళ్లి సమర్పించనున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటికే అజ్మీర్ దర్గాకు వెళ్లి మొక్కు చెల్లించుకున్నానని, ప్రస్తుతం తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా జాగృతి ఆవిర్భవించబోతున్న నేపథ్యంలో మళ్లీ ఆశీస్సులు పొందేందుకు చాదర్ పంపుతున్నామని తెలిపారు.
ఖ్వాజా గరీబ్ నవాజ్ ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

Post a Comment