-->

బస్సును ఢీకొట్టిన ఇసుక టిప్పర్‌.. 9 మందికి గాయాలు

బస్సును ఢీకొట్టిన ఇసుక టిప్పర్‌.. 9 మందికి గాయాలు


నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలోని జాకోర ఎక్స్‌ రోడ్డు వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును ఇసుక టిప్పర్‌ ఢీకొనడంతో 9 మంది ప్రయాణికులు గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హన్మాజిపేట్‌ మీదుగా వర్ని వైపు వెళ్తుండగా, పొతంగల్‌ నుంచి ఇసుక లోడుతో వస్తున్న టిప్పర్‌ అదుపుతప్పి బస్సును ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం 71 మంది ప్రయాణికులు ఉన్నారు.

ఈ ప్రమాదంలో 9 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

టిప్పర్‌ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793