-->

ప్రేమించిన యువతి మోసం చేసిందనే మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

 

ప్రేమించిన యువతి మోసం చేసిందనే మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య సరిత తన బిడ్డను అమ్మేసి, మరో వ్యక్తిని పెళ్లికి రెడీ

హైదరాబాద్‌ నగర పరిధిలోని హయత్‌నగర్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కొహెడ గ్రామానికి చెందిన పల్లపు గోవర్ధన్ అనే యువకుడు ప్రేమ వ్యవహారం కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.

పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గోవర్ధన్ నాలుగేళ్ల క్రితం సరిత అనే యువతిని ప్రేమించి, ఇంట్లో వారికి తెలియకుండా వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికీ ఒక బిడ్డ కూడా పుట్టింది. అయితే ఇటీవల సరిత తన బిడ్డను అమ్మేసి, మరో వ్యక్తిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైందని సమాచారం.

ఈ విషయం తెలిసిన గోవర్ధన్ పలుమార్లు సరితను తనతో కలిసి రావాలని బతిమాలినప్పటికీ, ఆమె నిరాకరించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అంతేకాకుండా, తన పెళ్లి ఏర్పాట్ల పనులు కూడా గోవర్ధన్ చేతనే చేయించుకుందని తెలిసి అతడు మరింత మనస్తాపానికి గురైనట్లు సమాచారం.

మంగళవారం రాత్రి డ్యూటీ ముగించుకుని బుధవారం ఉదయం సుమారు 10:30 గంటలకు ఇంటికి వచ్చిన గోవర్ధన్, సాయంత్రం వరకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన అతని సోదరి తలుపులు పగలగొట్టి చూడగా, గదిలో ఉరివేసుకుని మృతదేహంగా కనిపించాడు.

ఆత్మహత్యకు ముందు గోవర్ధన్ తన మొబైల్ ఫోన్‌లో ఓ వీడియో రికార్డ్ చేశాడు. తన మరణానికి కారణమైన యువతిని వదిలిపెట్టవద్దని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

గోవర్ధన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా, అమ్మేశారనే ఆరోపణలు వచ్చిన చిన్నారి ఆచూకీ ఇప్పటివరకు తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు.

Blogger ఆధారితం.
Verification: 0c7a163838894793